English   

అభిమానులను నిరాశ పరుస్తున్న ప్రభాస్ 

Prabhas
2019-02-07 15:59:36

నిదానమే ప్రధానం అనే మాటను ప్రభాస్ బాగా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ఈయన నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆగష్టు 15కు సినిమా విడుదల చేస్తాం అంటూ దర్శక నిర్మాతలు ప్రకటించినా కూడా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్ కు సినిమా రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికీ కేవలం 60 శాతం షూటింగ్ పూర్తి కావడంతో దర్శకుడిపై అసంతృప్తితో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేస్తానని చెప్పిన ప్రభాస్.. అనుకున్నట్లుగానే వరస సినిమాలకు కమిట్ అవుతున్నాడు కానీ షూటింగ్స్ లో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు. సాహో సినిమాను రెండున్నరేళ్లుగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. ఇప్పటికీ ఇది పూర్తి కాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తమవుతోంది. షూటింగ్ జరుగుతున్న తీరు చూసి వాళ్ళల్లో నీరసం వచ్చేస్తుంది. ఆగస్టు 15కు కాకపోయినా అసలు ఈ ఏడాది సాహో సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి.. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీ లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ పై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుజీత్. దీని కోసం 20 కోట్లు పెట్టి బాంద్రా బ్రిడ్జి సెట్ ఆర్ఎఫ్సీలో వేసారు. మొత్తానికి సాహో సినిమా విడుదల తేదీపై.. ఆ చిత్రం షూటింగ్ వివరాలపై దర్శకుడు సుజీత్ వచ్చి ప్రేక్షకులకు, అభిమానులకు చెబితే కానీ ఉన్న అనుమానాలు తీరిపోవు. మరి ఇది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

More Related Stories