English   

బ్రహ్మానందాన్ని పరామర్శించిన బన్నీ !

Allu-Arjun
2019-02-07 17:25:32

టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఇటీవలే ముంబైలో గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. బ్రహ్మానందం ఆరోగ్యం క్షీణించిందని, అందుకే అయన ఇప్పటి వరకూ ముంబైలోనే ఉండిపోయారని ప్రచారం చేశారుగు. అయితే ఇక వాటికి ఫుల్ స్టాప్ పడినట్లే. ఎందుకంటే బ్రహ్మానందం నిన్న క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. నిన్న ఉదయం ఆయన హైద్రాబాద్ తిరిగి వచ్చారని బ్రహ్మానందం ఆరోగ్యం కుదుటగానే ఉందని, త్వరలో అయన షూటింగులలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అయితే తాజాగా  బ్రహ్మానందాన్ని స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. ఆయన మునుపటిలా చురుక్కా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని బన్నీ పేర్కొన్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే నిన్న బ్రహ్మానందాన్ని నటుడు మోహన్ బాబు కూడా పరమర్సించారని సమాచారం.

More Related Stories