English   

సైలెంట్ గా వెంకీ కూతురి ఎంగేజ్మెంట్ !

Venkatesh
2019-02-07 11:28:57

ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. సినీ ప్రముఖుల కుమారులు, కుమార్తెలు ప్రేమ పెళ్లిళ్ల వైపే మొగ్గు చూపుడం చూస్తూనే ఉన్నాం. వారి తల్లిదండ్రులు కూడా ప్రేమకు పెద్ద మనసుతో అంగీకరించి కులాల పట్టింపు లేకుండా వివాహం జరిపిస్తున్నారు. తాజాగా మరో ప్రేమకథ పెళ్లిపీటలెక్కబోతోందని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ప్రేమ వివాహానికి వాళ్ల ఇంట్లో పెద్దలు అంగీకరించినట్టు సమాచారం. ఈరోజు ఆమె నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో కేవలం సన్నిహితుల సమక్షంలో సైలెంట్ గా కానిచ్చేసారట. అయితే పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా మార్చి 1న చేయాలనీ నిర్ణయించారట. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా వెంకటేష్ అన్న సురేష్ బాబు సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారన్న వార్తలు ఒక ఆరు నెలల క్రితం వచ్చాయి. అయితే ఇరు కుటుంబాల నుండి ఈ పెళ్లి కబురు అధికారికంగా రావాల్సిఉంది. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు అట.  నిజానికి ఇప్పటి వరకూ వెంకీ తన ఫ్యామిలీని పెద్దగా బయట ప్రపంచానికి చూపించింది లేదు. వెంకీకి ఒక కుమారుడు అర్జున్, కూతురు ఆశ్రిత ఉన్నారు. కూతురు ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకుని ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది.

More Related Stories