English   

పూరీ కొడుకు సినిమాకి రంగం సిద్దం !

Puri-Jagannadh
2019-02-07 19:09:40

పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి గతే డాది హీరోగా 'మెహబూబా' అనే సినిమా చేశాడు. ఆ చిత్రానికి పూరియే దర్శకుడు, నిర్మాత. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఆకాష్. నిజానికి  బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించిన ఆకాష్ కి కెమెరా కొత్తేమీ కాదు అదీ కాక నటనలో ఈజ్ ఉంది.  టీనేజ్ లో ఉన్నప్పుడే 'ఆంధ్రపోరి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా అది ఆకాష్ కి వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్ళ గ్యాప్ తీసుకున్న ఆయన తండ్రి డైరెక్షన్లోనే మెహబూబా' తో రీలాంచ్ అయ్యాడు. ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం అతను మరో సినిమా ప్రయత్నం చేస్తున్నాడు. అతని కొత్త సినిమా త్వరలో లాంచ్ కానుందని అంటున్నారు. ఈ సినిమాకు గతంలో పూరి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనిల్ పాడూరి అనే ఆయన దర్శకుడిగా లాంచ్ చేస్తున్నారట. ఈ సినిమాకు కథ తానే అందించడంతో పాటు నిర్మాతగా కూడా తానే వ్యవహరిస్తున్నాడట పూరి. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అసలు సినిమా తర్వాత సినిమా ఏమాత్రం గ్యాప్‌ లేకుండా సినిమాలు చేసే పూరి మెహబూబా ఫ్లాప్‌తో సైలెంట్ అయ్యాడు. దాని తర్వాత ఇప్పటికి రాంతో సినిమా మొదలుపెట్టాడు.

More Related Stories