English   

ప్రవీణ్ సత్తారుతో నాగ చైతన్య సినిమా !

Praveen-Sattaru
2019-02-07 12:18:32

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మజిలీ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా దాపు పూర్తి కావొస్తుండగా ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వెంకీమామ సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు చైతన్య. ఈ సినిమా తరువాత ఆయన ఒక కొత్త దర్శకుడితో కలిసి చైతూ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు బ్యానర్‌లో నిర్మితం కానుంది. ఆ తరువాత ప్రవీణ్ సత్తారు సినిమా చేయనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. గరుడవేగతో హిట్ కొట్టిన ప్రవీణ్‌ చాలా కాలం నుండి సైలెంట్ గానే ఉన్నారు ఇప్పుడు ఆయనకి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవలే ప్రవీణ్ కు చైతు కు ఓ అదిరిపోయే స్టోరీ వినిపించాడట. అది బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పాడట. నిజానికి ప్రవీణ్ సత్తారు మెయిన్ స్ట్రీమ్ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. నలుగురి జీవితాలతో తెరకెక్కించిన చందమామ కథలుతో విమర్శకులను మెప్పించాడు. ఇక గుంటూరు టాకీస్ తో వసూళ్ల కూడా సాదించాడు. గరుడవేగతో హిట్ కొట్టాక నెట్‌ఫ్లిక్స్‌ కోసం శివగామి వెబ్‌సిరీస్ కూడా డైరెక్ట్ చేశాడు ఈ యువ డైరెక్టర్.

More Related Stories