English   

టైం బ్యాడ్...ఆయన తీసిన సినిమా నచ్చలేదట !

Tamil Version Of Arjun Reddy To Be Reshot
2019-02-08 01:15:35

ఒకానొక సమయం లో ఆయన డేట్లు ఖాళి ఉంటె చాలు అనుకుని స్టార్ హీరోలు పెద్ద ప్రొడక్షన్ హౌస్ వెయిట్ చేసిన "శివ పుత్రుడు" ఆయన. కానీ నేటి రోజున ఆయన కంప్లీట్ చేసిన ఒక సినిమా మొత్తం నచ్చలేదని, పక్కన పడేసి మల్లి కొత్త డైరెక్టర్ తో మొత్తం సినిమా అంతా రీషూట్ చేసే దాకా వచ్చింది. అయన ఎవరో కాదు తమిళ దర్శకుడు బాల. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని నమోదు చేసింది. దీంతో ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందినవాళ్లు ఈ సినిమా రీమేక్ హ‌క్కుల కోసం పోటీ ప‌డి ద‌క్కించుకున్నారు. హిందీలో తెలుగు మాతృక తెరకెక్కించిన సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోనే షాహిద్ క‌పూర్ హీరోగా `క‌బీర్‌సింగ్‌` పేరుతో తెర‌కెక్కుతుండగా త‌మిళంలో హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోగా బాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్మ అనే పేరుతో సినిమా తెర‌కెక్కుతోంది. అయితే త‌మిళ వెర్ష‌న్ వ‌ర్మ‌ను ఇప్పుడు విడుద‌ల చేయ‌బోవ‌డం లేద‌ని నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అఅయితే సినిమా అంతా సిద్ధ‌మైనా ఫ‌స్ట్ కాపీ చూసిన వారికి సంతృప్తిగా అనిపించ‌లేద‌ట. అందుకే ఇప్పుడు త‌మిళ వెర్ష‌న్‌ ను రీషూట్ చేయాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. మ‌రో వెర్ష‌న్‌ను సిద్ధం చేసి జూన్‌లో విడుద‌ల చేయాల‌నేది నిర్మాణ సంస్థ ఆలోచ‌న‌గా క‌న‌ప‌డుతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాకు హీరో ధ్రువ్ మిన‌హా డైరెక్ట‌ర్ స‌హా అంద‌రినీ కొత్త వారిని తీసుకోవాల‌నుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమా కోసం ఖర్చు చేసిన బడ్జెట్ ని విక్రమ్ బరించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ఎవరైనా కొత్త డైరెక్టర్ ని సంప్రదించారా ? అనేది తెలియాల్సి ఉంది.

More Related Stories