English   

ఆ హీరో మీద పెట్టుబడి పెడుతున్న మహేష్ !

Adivi-sesh
2019-02-08 08:36:52

హీరోగా బిజీగా ఉన్న మహేష్ బాబు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మహేష్ బాబు ఆ తరువాత బ్రహ్మోత్సవం సినిమాను సొంతగా ప్రొడ్యూస్ చేశాడు. అయితే శ్రీమంతుడు మాత్రం సూపర్ హిట్ అవగా బ్రహ్మోత్సవం మాత్రం భీబత్సంగా దెబ్బెసింది. అయితే మళ్ళీ మహేష్ బాబు తన నిర్మాణ సంస్థ మహేష్ బాబు సినిమా ప్రొడక్షన్స్ లో సినిమాలు చేయబోతున్నాడు. అయితే, హీరోగా కాదండోయ్ నిర్మాతగానే. మహేష్ ప్రొడక్షన్స్ లో ఓ వెబ్ సీరీస్ తెరకెక్కబోతున్నరన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా మహేష్ స్ట్రెయిట్ మూవీని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. క్షణం, గూఢచారి వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న అడవి శేష్ హీరోగా మహేష్ బాబు సినిమాను నిర్మించబోతున్నాడని అంటున్నారు. గూఢచారి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని సమాచారం. ఈ సినిమా గురించి త్వరలోనే అఫిషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సినీ జనం.

More Related Stories