English   

యాత్ర ఫస్ట్ షో టాక్...విజయ యాత్ర !

Yatra
2019-02-08 08:52:59

తెలుగు ప్రజలకు ఇద్దరే అభిమాన నాయకులు ఒకరు శ్రీ నందమూరి తారక రామారావు కాగా మరొకరు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజకేయంగా ఎన్ని విమర్శలు చేసినా ప్రతి తెలుగు వాడు ఒప్పుకు తీరే నిజాలు ఇవి. అలాంటి ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా సంక్రాంతికి కదా నాయడకుడు రిలీజ్ అవగా నేడు వైఎస్ జీవితంలో చేసిన మహా పాదయాత్రను లైన్ గా తీసుకుని చేసిన ‘యాత్ర’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించడంతో పాటు భారీ స్టార్ క్యాస్టింగ్ చేయడంతో ఈ సినిమాకి విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. ఓవ‌ర్‌సీస్‌లో 180 స్క్రీన్స్‌, ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్‌లో అలా ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం 970 స్క్రీన్స్‌లో విడుద‌ల చేయ‌టం ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ టాక్ బయటకి వచ్చింది. దాన్ని బట్టి వైఎస్‌గా నటించిన మమ్ముట్టి ఎంట్రీ సీన్ మొదలు ఆయన ఉన్న సీన్స్ అన్నీ అద్బుతంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే దర్శకుడు సూటిగా చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా చూపించారంటున్నారు. వైఎస్‌ పాదయాత్ర నేపథ్యంలో ప్రజలతో ఏర్పరచుకున్న ఎమోషనల్ బాండింగ్ మొత్తాన్ని చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించారంట.  ఫస్టాఫ్ స్లోగా సాగిందని సెకండాఫ్ ఊపందుకుందంటున్నారు. అలాగే ఏపీ సీఎం మీద కొన్ని సెటైర్లు కూడా వేశారట. 

More Related Stories