English   

దానయ్య, బోయపాటి మధ్య రచ్చ !

Boyapati
2019-02-08 16:21:34

ఎన్నో అంచనాల మధ్య బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాకి రిలీజ్ రోజు ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కానీ ఎంత డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా అటూ ఇటుగా 60 కోట్ల షేర్ రాబట్టింది. అయితే బయ్యర్లకు 30 కోట్ల వరకు నష్టం తెచ్చిపెట్టి నిర్మాతని చిక్కులో పడేసింది. భారీ నష్టం జరిగింది కాబట్టి నువ్ తీసుకున్న రెమ్యునరేషన్ లోంచి 5 కోట్లు తిరిగి ఇస్తే నేను చరణ్ పది కోట్లు కలిపి మొత్తం 15 కోట్లు బయ్యర్లకు పంచుతామని చెప్పాడట అయితే ఈ విషయం మాత్రం బోయపాటి విబేధించాడట. ఈ విషయం మీద ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని ఫిలిం నగర్ టాక్. మరి ఈ గొడవని సినీ పెద్దలు ఎలా సెటిల్ చేస్తారో చూడాలి. నిజానికి సినిమా కోసం పని చేసి డబ్బులు తీసుకోవడం తప్పు లేదు, భారీ రేట్లకి కొన్న బయ్యర్లు సినిమాల్లో లాభాలు వస్తే రిటర్న్ ఇవ్వరు కానీ ఇలా నష్టపోయినప్పుడు మాత్రం డబ్బులు కావాలి అనడం ఏంటనేది కొందరి ప్రశ్న. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బయ్యర్లు నిర్మాతను ఆడిగేది న్యాయం చేయమని, అంటే వచ్చే సినిమాకి మాకు ప్రేఫరేన్స్ ఇవ్వమని, కానీ తర్వాత సినిమా ఆర్ఆర్ఆర్ కావడంతో ఈ నష్టాలను ఇప్పుడే వదిలించుకోవాలని దానయ్య చూస్తూ ఉండచ్చు.

More Related Stories