English   

ట్రోల్స్ కి చెంప పెట్టు రెహమాన్ ట్వీట్ !

Rahman
2019-02-08 10:38:39

ఇండియన్ మ్యూజిక్ ని ప్రపంచ స్థాయిలో పరిచయం చేసిన వ్యక్తి ఏ ఆర్ రెహమాన్. అతని ప్రతిభతో ఆస్కార్ సొంతం చేసుకున్నాడు. కానీ ఇప్పటి దాకా ఎలాంటి వివాదాల్లో తలదూర్చలేదు. తన పనేదో తాను చూసుకుంటూ పోయేవాడు. కానీ తాజాగా రెహమాన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అది కూడా తన ప్రమేయం లేకుండానే అదేంటంటే 10 సంవత్సరాల క్రితం విడుదలైన స్లం డాగ్ మిలియనీర్ ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు రెహమాన్ సమకూర్చిన స్వరాలకి ఆస్కార్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం విడుదల పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెహమాన్ కుమార్తె ఖతీజా ముఖ్య అతిధిగా  వచ్చింది. అయితే ఖతీజా తన తండ్రి విజయాన్ని గుర్తుచేసుకుంటూ బావోద్వేగంగా మాట్లాడింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఖతీజ స్టేజ్ పైకి బుర్కా వేసుకు రావడంపై చర్చ మొదలైంది. రెహమాన్ తన కూతురికి ఎన్ని ఆంక్షలు విధిస్తారు. రెహమాన్ తన కూతురిని బుర్కా వేసుకోమని చెప్పాడా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై ఖతీజ స్పందించింది తాను బుర్కా ధరించడంలో ఎవరి బలవంతం లేదని నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి అనవసర విమర్శలు చేయకండని, మా అమ్మా నాన్న నా స్వేచ్ఛని గౌరవిస్తారని ఫేస్ బుక్ లో చెప్పుకొచ్చింది.  ఈ విషయం మీద రెహమాన్ కూడా స్పందించి తన పెద్ద కుమార్తె ఖతీజా, రెండో కుమార్తె రహీమా, సతీమణి సైరా నీతూ అంబానీతో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇందులో తన భార్య, రెండో కుమార్తె బుర్ఖా లేకుండా ఉండగా ఖతీజా ఒక్కతే బుర్ఖా వేసుకునే ఉంది. అలాగే కింద ఫ్రీడం టు చూస్ అని పేర్కొన్నాడు.  

More Related Stories