English   

పరశురాం ఎందుకు సైలెంట్ అయ్యాడు !

Parasuram
2019-02-08 18:11:03

గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ పరుశురామ్. అయితే  ఆ సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టలేదు. అతని వెంట చాలా మంది నిర్మాతలు పడ్డా తాను మాత్రం మెగా కాంపౌండ్ దాటనని చెప్పేశాడు. ఆయన నెక్స్ట్ మూవీ గీత ఆర్ట్స్ లోనే ఉండబోతుంది. గీత ఆర్ట్స్ సంస్థ కూడా పరుశురామ్ కు మంచి హీరోతో సెట్ చేయాలని చూసింది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా ప్లాన్ చేయాలనీ అల్లు అరవింద్ భావించారు. కానీ ఈజ్ లో ఉన్న మహేష్ వరుసుగా సినిమాలు ఓకె చేసేస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ సినిమా ఫిక్స్. అనిల్ రావిపూడిది కూడా ఓకే చేస్తే ఇంకో రెండు దాకా మహేష్ దొరకరు. మరి అప్పుడు పరుశురామ్ ఏం చేస్తారు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. నిజానికి ఆయన బన్నీతో సినిమా చేస్తారని భావించారు, అయన సినిమా ఇప్పుడు త్రివిక్రమ్ తో ఓకే అవడంతో ఈయన సినిమా ఎప్పుడు అనేది ఆశ్చర్యంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే గీతాలో బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల సబ్జెక్ట్ లతో రెడీగా వున్నారు. ఇప్పుడు ఆ లైన్ లో పరుశురామ్ కూడా వెయిటింగ్.

More Related Stories