English   

పెద్ద హీరోలకు ఏమైంది.. ఏడాదికి రెండు సినిమాలు చేయొచ్చుగా..

tollywood star heros
2019-02-09 01:22:42

ఎప్పటి నుంచో నడుస్తున్న వాదన ఇది.. ఎందుకు పెద్ద హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయట్లేదు.. అనే వాదన ఇప్పుడు కాదు చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో నడుస్తుంది. ఒక్కరూ ఇద్దరూ కాదు చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మహా అయితే ఒక అరడజను మంది మాత్రమే సూపర్ స్టార్ లు ఉన్నారు. వీళ్ళు ఏడాదికి రెండు సినిమాలు చేస్తే దాదాపు 500 కోట్ల బిజినెస్ జరుగుతుంది. కానీ ఏడాదికి ఒక్క సినిమా మించి చేయడం లేదు. కొందరైతే ఆ ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అడిగితే కథలు దొరకడం లేదు అంటున్నారు. నిజంగానే కథలు దొరకడం లేదా.. లేదంటే వీళ్లకు వీలు కుదరడం లేదా అని అడుగుతున్నారు అభిమానులు.. వాళ్ళతో పాటు విశ్లేషకులు. ఎందుకంటే బాలీవుడ్ లో కొందరు హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.. మరి వాళ్లకు కథలు ఎక్కడినుంచి దొరుకుతున్నాయి. వీళ్ళ కంటే పెద్ద సూపర్ స్టార్లు వాళ్లు. వాళ్లే రెండు మూడు సినిమాలు చేస్తున్నప్పుడు మన హీరోలు కనీసం రెండు సినిమాలు చేయలేరా.. ఇదే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా ఎంత మందిని తీసుకున్నా ఏడాదికి ఒక సినిమా నుంచి చేయడం లేదు. వీళ్లంతా మనసు పెట్టి రెండు సినిమాలు కానీ చేస్తే తెలుగు ఇండస్ట్రీ రేంజ్ మరింత పెరగడం ఖాయం. కానీ అది జరగడం చాలా కష్టం. నిజంగానే వీళ్ళకు కథలు దొరకక ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం కష్టంగా మారిపోతుంది. మరి దీనికి సమాధానం ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

More Related Stories