English   

డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు.. మరి వాళ్ళను కాపాడేదెవరు..

big losses to ram charan and Rajinikanth movie distributors
2019-02-09 01:53:49

స్టార్ హీరోలు ఉన్నారు కదా అని ముందు వెనకా చూసుకోకుండా కోట్లకు కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోతున్నారు. మొన్నటికి మొన్న విడుదలైన రజనీకాంత్ పేట సినిమా బయ్యర్లను దారుణంగా ముంచేసింది. దాంతో పాటు విడుదలైన రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా కూడా 30 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల నష్టాలు ఎవరు తీరుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై రామ్ చరణ్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తాను తీసుకున్న పారితోషికం లో ఐదు కోట్లు వెనక్కి ఇచ్చేయాలని ఫిక్సయిపోయాడు మెగా వారసుడు. ఇదే సమయంలో నిర్మాత డి.వి.వి.దానయ్య కూడా కొంత మొత్తం వెనక్కి ఇస్తున్నాడు. రజినీకాంత్ పేట సినిమాకు ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారనేది అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ సినిమా తమిళనాట పర్లేదు అనిపించింది కానీ తెలుగులోనే దారుణంగా నష్టపోయింది. ఇక్కడ 20 కోట్లకు ఈ చిత్రం రైట్స్ తీసుకుంటే సంక్రాంతి పోరులో అన్ని సినిమాల మధ్య పడి నలిగి తీసుకొచ్చింది కేవలం ఆరు కోట్లు మాత్రమే. దాంతో దాదాపు 15 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. దీనిపై ఎవరు నోరు మెదపడం లేదు ఇప్పుడు. ఇదిలా ఉంటే తమ సినిమాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉన్నప్పుడు సొంత ప్రొడక్షన్ లో చేసుకుంటున్నారు మన హీరోలు. అలాంటి సమయంలో భారీ బడ్జెట్ సినిమాలను కూడా తమ ప్రొడక్షన్ లోనే చేస్తే డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోతారు అనే భయం ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇంత దారుణంగా స్టార్ హీరోలను నమ్మి డిస్ట్రిబ్యూటర్లు రోడ్డును పడుతుంటే వాళ్ళ ఏమి కావాలి అంటూ అనుమానాలు.. వాదన రెండూ రేగుతున్నాయి ఇండస్ట్రీలో. సంక్రాంతికి రజినీకాంత్, రామ్ చరణ్ తో పాటు బాలకృష్ణ కథానాయకుడు సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా దారుణంగా నిరాశ పరచగా మహానాయకుడు సినిమాను నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఉచితంగా ఇవ్వడానికి ఫిక్సయిపోయాడు బాలయ్య. రజినీకాంత్, రామ్ చరణ్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో లేదో చూడాలి.

More Related Stories