English   

బోయపాటి శ్రీనును నమ్ముకుంటున్న చంద్రబాబు..

ap cm chandrababu naidu hope on boyapati srinu
2019-02-09 02:54:20

అదేంటి బోయపాటి శ్రీనును చంద్రబాబు నమ్ముకోవడం ఏంటి అనుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు నిజంగానే చంద్రబాబునాయుడు.. బోయపాటి శ్రీను సాయం తీసుకుంటున్నాడు. కేవలం సినిమాలో కాకుండా అప్పుడప్పుడూ యాడ్స్ కూడా చేస్తుంటాడు బోయపాటి శ్రీను. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని ప్రభుత్వ యాడ్స్ ను బోయపాటి శ్రీను చేతుల్లో పెడుతున్నాడు చంద్రబాబునాయుడు. గతంలో కూడా ఇదే చేశాడు. ఆ మధ్య పుష్కరాల సమయంలో వచ్చిన కొన్ని యాడ్స్ బోయపాటి శ్రీను తెరకెక్కించినవే. ఆ తర్వాత అమరావతికి సంబంధించిన యాడ్స్ కూడా ఈయన తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం యాడ్స్ బోయపాటి శ్రీను తెరకెక్కించాలని చంద్రబాబునాయుడు కోరగా.. ఆయన కూడా సరే అన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన బాలకృష్ణ సినిమాతో బిజీగా ఉన్నాడు. మహానాయకుడు పూర్తి కావడానికి మరో నెల రోజులైనా పట్టేలా ఉంది. దాంతో అప్పటి వరకు కాళీ గానే ఉంటాడు. ఈ వ్యవధిలోనే తెలుగుదేశం ప్రకటనలు బోయపాటితో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా కొన్ని యాడ్స్ చిత్రీకరిస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్స్ నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో సినిమా అట్రాక్షన్ కూడా పెరిగిపోతుంది.

More Related Stories