English   

విక్రమ్ కొడుకు వర్మ సినిమాలో ఆపింది ఎవరో తెలుసా..

Dhruv-Vikram
2019-02-09 11:46:43

సినిమా మొత్తం తెరకెక్కించిన తర్వాత తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయాలంటే చాలా ధైర్యం కావాలి. అప్పటివరకు పెట్టిన కొన్ని కోట్లు తీసుకెళ్లి అలా మూల పడేయడం చిన్న విషయం కాదు. దర్శక నిర్మాతలకు ఎంత గుండె ధైర్యం కావాలి.. ఇప్పుడు విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన వర్మ సినిమా విషయంలో ఇదే జరిగింది. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తమిళంలో ఈ కుర్ర హీరోతో రీమేక్ చేసాడు సంచలన దర్శకుడు బాల. అయితే సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత వాళ్లకు అస్సలు నచ్చకపోవడంతో ఈ సినిమా విడుదల అయితే కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా హీరో విక్రమ్ కూడా తన తనయుడు సినిమాను చూసి షాక్ అయ్యాడని తెలుస్తోంది. అంత దారుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని.. ఇలాంటి సినిమా బయటికి వస్తే తన తనయుడు కెరీర్ నాశనం అవుతుందని విక్రమ్ భయపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎంత ఖర్చయినా పర్లేదు ముందు ఆ సినిమాను బయటకు రాకుండా ఆపండి అంటూ విక్రమ్ నిర్మాతలకు చెప్పాడని తెలుస్తోంది. రీ షూట్ కు డబ్బులు మొత్తం విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తనయుడు సినిమా ఆగిపోవడంతో ఈయనదే ప్రధాన పాత్ర. మొత్తానికి సినిమా మొత్తం తెరకెక్కించిన తర్వాత అవుట్ పుట్ నచ్చక మళ్లీ సినిమా మొత్తం రీ షూట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఈ విషయంలో విక్రమ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇది ధ్రువ్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

More Related Stories