English   

పెళ్లి వద్దట...కన్యగానే ఉంటుందట !

Sai-Pallavi
2019-02-09 13:50:50

మలయాళ చిత్రం ప్రేమమ్‌ తో ఒక్కసారిగా పాపులర్‌ అయిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమా చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి క్రేజ్‌ వచ్చి ఇక్కడే సేటిలయ్యినది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోన్న సాయిపల్లవి. హీరోయిన్ గా అయితే బాగానే సెటిల్ అయ్యింది. చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అవకాశాలు కోసం హద్దులు దాటదని మంచి పేరు కూడా ఉంది. అయితే ఈ భామ పెళ్లిపై స్పందించిన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మళయాళ కుట్టి తాను పెళ్లి అసలే చేసుకోనని, కన్యగానే మిగిలిపోతానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఆమె ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ మీరు  పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ప్రేమ వివాహం ? చేసుకుంటారా అని సాయి పల్లవిని ప్రశ్నించగా ఆమె పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం పెళ్ళే చేసుకోనని చెప్పింది సాయిపల్లవి. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాయిపల్లవి తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్స్, ఆమె అభిమానులు సమర్ధిస్తున్నారు.

More Related Stories