English   

ఎక్క‌డికి పోతావు చిన్న‌దానా.. సెగలు పుట్టిస్తున్న నందిత శ్వేత..

Nandita-Swetha
2019-02-09 07:12:56

నందిత శ్వేత‌.. టాలెంట్ ఉన్నా కూడా అవ‌కాశాలు లేని.. రాని హీరోయిన్. ఈ భామ ఎవ‌రో తెలుసుకోవాలంటే.. ఒక్క‌సారి ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాను గుర్తు చేసుకోండి. అందులో దెయ్యంగా నటించింది ఈ భామే. హెబ్బాప‌టేల్ అందులో మెయిన్ హీరోయిన్ అయినా కూడా త‌న న‌ట‌న‌తో పూర్తిగా కుమారి 21 ఎఫ్ ను డామినేట్ చేసింది నందిత శ్వేత‌. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకో కానీ తెలుగులో నందిత‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదు ఏ ద‌ర్శ‌కుడు కూడా. దాంతో అందాల ఆర‌బోత‌కు కూడా తెర తీసింది ఈ భామ‌. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ వేడి పుట్టించేస్తుంది. అస‌లు ఆ చిన్న‌దేనా ఇలా రెచ్చిపోతుంద‌నే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. అవ‌కాశాల కోసం త‌ప్ప‌ట్లేదంటూ నందిత శ్వేత కూడా గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. దీనికి ఫ‌లితంగానే ఇప్పుడు రెండు సినిమాల్లో ఆఫ‌ర్ ప‌ట్టేసింది ఈ భామ‌. శ్రీ‌నివాస క‌ళ్యాణంలో ఓ హీరోయిన్ గా నటించినా నందిత శ్వేత‌కు వచ్చిందేమి లేదు. మ‌రి చూడాలిక‌.. ఈ ఫోటో షూట్ అయినా ఈ చిన్న‌దాని కెరీర్ కు బ‌లాన్నిస్తుందో లేదో..?

More Related Stories