English   

మొత్తానికి మహానాయకుడికి గుమ్మడి కాయ కొట్టేశారు !

Mahanayakudu
2019-02-09 19:23:23

ఏపీ మాజీ సీఎం, తెలుగు ప్రజల అందరూ అన్నగా భావించే నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని రెండు భాగాలుగా ఒకటి కధానాయకుడు, మహానాయకుడు రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే కధా నాయకుడు సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే అది సినిమా ప‌రంగా మంచి టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు పెద్దగా రాలేదు. అందుకే రెండవ భాగం మీద ద్రుష్టి పెట్టిన టీం మళ్ళీ కొంత షూట్ చేసింది. తాజాగా మ‌హానాయ‌కుడు షూటింగ్ పూర్త‌యింది. ఈ రోజు హైద‌రాబాద్‌లోని సార‌ధి స్టూడియోలో తెర‌కెక్కించిన కొన్ని స‌న్నివేశాల‌తో ఈ షూటింగ్‌ కి తెర పడినట్టే అని సమాచారం. దీంతో గుమ్మ‌డి కాయ కొట్టేసి తంతు ముగించారు. నిజానికి జ‌న‌వ‌రి 22 నాటికే షూటింగ్ పూర్త‌వ్వాల్సింది. కానీ క‌థానాయ‌కుడు ఎఫెక్ట్‌తో మ‌హానాయ‌కుడులో రిపేర్ల పేరుతో రీషూట్లు చేసి కొన్ని కొత్త స‌న్నివేశాల్ని తెర‌కెక్కించేస‌రికి ఇన్నాళ్ళు పట్టింది. దాంతో విడుద‌ల కూడా లేట్ అయ్యింది. దీంతో తేదీలోనూ మార్పులొచ్చాయి. ఫిబ్ర‌వ‌రి 7నే సినిమా రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటి వరకూ ఎప్పుడు రిలీజ్ అనేది ప్రకటించలేదు. అయితే ఈ మధ్య మార్చి 1న వ‌స్తోంద‌ని టాక్‌ వినిపిస్తోంది. అధికారికంగా డేట్ ప్రకటించలేదు కానీ కొన్ని రోజుల్లో అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.  

More Related Stories