English   

సానియా బయోపిక్ కూడా రెడీ !

Sania Mirza biopic is ready
2019-02-09 13:41:44

టాలీవుడ్, కోలీవుడ్‌ లోనే కాదు బాలీవుడ్‌లోనూ బయోపిక్‌ ల ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నాయకులు, సినిమా స్టార్ల జీవితాలే కాకుండా క్రీడాకారుల జీవితాలపైనా సినిమాలు తీసేస్తున్నారు. బాగ్ మిల్కా బాగ్, మేరీ కోమ్, ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ, దంగల్ లాంటి చిత్రాలు ఆ కోవలోనివే. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను అలరించేందుకు మరో టెన్నిస్ స్టార్ సినిమా సిద్ధం కాబోతుంది. అవును సానియా మీర్జా జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రొన్ని స్క్రూవాలా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకో బోతుంది. కొద్ది నెలలుగా వస్తున్న ఈ గాసిప్స్ ని సానియామీర్జా నిర్దారించారు. చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలుపెట్టేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఆ విషయం అయితే చెప్పింది కానీ తన పాత్రలో ఎవరు నటిస్తారనేది మాత్రం సానియా చెప్పలేదు. కానీ చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని కీలక సన్నివేశాల్లో సానియానే కనిపించనున్నారట. అయితే అవి మళ్ళీ షూట్ చేస్తారా లేక ఒరిజినల్ ఫుటేజ్ వాడతారా ? అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

More Related Stories