English   

అంతా అసత్య ప్రచారమే....బాలా క్లారిటీ !

film maker bala responded on arjun reddy remake varma re shoot again
2019-02-10 01:55:44

అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం వ‌ర్మ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి త్వ‌ర‌లో మళ్ళీ మొదలు పెడుతున్నట్టు ఆ సినిమా నిర్మాత‌లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజా చిత్రం ధృవ్ విక్ర‌మ్‌ ప్ర‌ధాన పాత్ర‌లోనే తెర‌కెక్క‌నుండ‌గా, ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర న‌టీన‌టులు సహా అంద‌రు కొత్తవారే ఉంటారని  ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ‌. అనుకున్న అవుట్ పుట్ రాలేదని అందుకే సినిమా మళ్ళీ తీస్తున్నామని నిర్మాత‌లు చేస్తున్న ప్ర‌చారంపై తాజాగా స్పందించారు బాలా. ప్రెస్ నోట్ విడుద‌ల చేసిన ఆయ‌న సినిమా ఆగిపోవ‌డానికి తాను రూపొందించిన విధానం కార‌ణం కాద‌ని, క్రియేటివ్ ఫ్రీడ‌మ్ వ‌ల‌నే సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్రకటించారు. అంతేకాక త‌న‌ మీద నిర్మాత‌లు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా తెలిపాడు. ధృవ్ కెరీర్ దృష్ట్యా ఈ విష‌యంపై తాను ఎక్కువగా మాట్లాడ‌ద‌లచుకోలేదని ఇక్కడితో ఈ విషయాన్ని ఆపేద్దామని ఆయన కోరాడు. చిత్ర యూనిట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం జ‌న‌వ‌రి 22తోనే ముగిసింద‌ని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అయితే వ‌ర్మ ప్రాజెక్ట్ నుండి బాలా త‌ప్పుకోవ‌డంతో ఈ మూవీని తెర‌కెక్కించే బాధ్య‌త గౌత‌మ్ మీన‌న్ తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ చేసిన ‘ధృవనక్షత్రం’ రిలీజ్‌కి రెడీ అయింది. ఇప్పుడు ‘వర్మ’ సినిమా చేస్తే తండ్రీ–కొడుకులతో గౌతమ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసినట్లు అవుతుంది. అంతేకాక హీరోయిన్ ని కూడా మార్చి శ్రీదేవి కోతురిని నటింపచేయాలని భావిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో వేచి చూడాలి. 

More Related Stories