English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కి ముహూర్తం !

ram gopal varma's lakshmis ntr trailer will release on feb 14th
2019-02-10 02:37:54

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ దివగంత ఎన్టీఆర్ జీవితంలోని ఒక అంకాన్ని బేస్ చసుకుని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ల‌క్ష్మీ పార్వ‌తి కోణం నుండి ఎన్టీఆర్ జీవితంకి సంబంధించిన వివ‌రాల‌ని ఇందులో చూపించ‌నున్నాడ‌ని చెబుతున్న వర్మ, అందుకు తగిన ప్రమోషన్ చేస్తున్నాడు. ఆఖరికి కేయే పాల్ ని కూడా వదల కుండా ఈ సినిమా ప్రమోషన్ కి వాడేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన వ‌ర్మ పాత్ర‌ల పేర్లు చెప్ప‌కుండానే మూవీ మీద మార్కెట్ పెంచుకుంటున్నాడు. అయితే చిత్ర ట్రైల‌ర్‌ని మ‌హానాయ‌కుడు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజున తొమ్మిది నిముషాల్లో విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ ఆ సినిమా లేట్ అవుతుందని అనుకున్నాడో ఏమో గానీ ముందుగానే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతుల అత్యంత డైనమిక్ లవ్ స్టోరీ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే రోజున ఉదయం 9.27 గంటలకు జీవీ ఫిలిమ్స్ సంస్థ విడుదల చేయనుందని వర్మ ప్రకటించాడు.  అయితే దీనికి ఒక ఆసక్తికర ట్యాగ్ కూడా పెట్టారు. మాములుగా అయితే అన్ని సినిమాలకు మాది కుటుంబ కథా చిత్రం అని పేర్కొంటే ఇక్కడ వర్మ మాత్రం అందుకు భిన్నంగా ఇది “కుటుంబ కుట్రల చిత్రం” అని అంటున్నారు. కృతజ్ఞతలేని, అవిశ్వాసవంతమైన కుటుంబసభ్యులు, వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వాళ్ల కథల కలయిక. అసలైన కథని తెలుసుకొనేందుకు సిద్ధంగా ఉండండమని వర్మ ట్వీట్ చేశారు. చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు. 

More Related Stories