English   

యాత్ర మూడు రోజుల వసూళ్లు.. వైఎస్ దూకుడు..

Yatra
2019-02-11 04:06:44

ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరిచిన నేపథ్యంలో వైఎస్ఆర్ బయోపిక్ మాత్రం అంచనాలు అందుకుంది. మమ్ముట్టి హీరోగా మహీ రాఘవ తెరకెక్కించిన యాత్ర సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తుంది. తొలి రోజు మూడు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. ఇక ఆ తర్వాత మూడో రోజు ఆదివారం కావడంతో వసూళ్లు ఇంకా పెరిగాయి. ఇప్పటివరకు మూడు రోజుల్లో 6 కోట్ల 12 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు.. విడుదలైన థియేటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తం. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కథానాయకుడు కంటే ఎక్కువ వసూలు చేస్తుంది. మూడు రోజుల తర్వాత కూడా ఇప్పటికీ అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు మరింత ఉత్సాహంగా ఈ సినిమాను అందరికీ చూపిస్తున్నారు. తమ అధినేత సినిమా కావడం.. దానికి మంచి టాక్ రావడంతో వాళ్లు పండగ చేసుకుంటున్నారు. ఇంటా బయట అన్నిచోట్ల యాత్ర సినిమా అదరగొడుతుంది. మలయాళంలో మమ్ముట్టి ఉండటంతో అక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది యాత్ర. ఫుల్ రన్ లో యాత్ర సినిమా ఈజీగా 15 కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే గాని జరిగితే సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది.

More Related Stories