English   

అక్షయ్ కుమార్ వైపు చూస్తున్న రాజమౌళి..

Akshay-Kumar
2019-02-11 04:27:37

బాలీవుడ్లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మన వాళ్లకు మాత్రం విలన్ గా కనిపిస్తున్నాడు. అందుకే మన దర్శకులు ఆయనను తీసుకొచ్చి సౌత్ సినిమాలో ప్రతినాయకుడిగా మార్చేస్తున్నారు. ఇప్పటికే 2.0 సినిమాలో రజనీకాంత్ కు ఆపోజిట్ గా నటించిన అక్షయ్ కుమార్.. భారతీయుడు 2 సినిమా కోసం కూడా చర్చలు సాగిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా అక్షయ్ కుమార్ నే విలన్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు దర్శకుడు శంకర్. ఇప్పుడు రాజమౌళి చూపులు కూడా అక్షయ్ కుమార్ వైపు పడుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంకా ప్రతినాయకుడు ఎవరో తెలియదు. ముందు ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ యష్ విలన్ గా నటిస్తాడని వార్తలు వినిపించాయి. కే జి ఎఫ్ సినిమాతో ఈయన తెలుగులో కూడా మంచి ఇమేజ్ అందుకున్నాడు. అయితే తాను రాజమౌళి సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఏకంగా అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి రాజమౌళి వచ్చి చెప్పే వరకు ఈ కన్ఫ్యూజన్ ఇలాగే సాగుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలో ఇంకా ఎంత మంది విలన్స్ పేర్లు వినాల్సి వస్తుందో చూడాలి.

More Related Stories