English   

తారక్ కోసం హాలీవుడ్ తార...రూటే సెపరేటు !

NTR
2019-02-11 12:42:27

ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ లో మంచి హిట్స్ తో ఫాం లో ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలు కావడంతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టవున్ గా మారింది. అందుకే ప్రస్తుతం అందరి దృష్టి దీనిపైనే ఉంది. రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎంత గోప్యత పతిద్దామని అనుకున్నా ఏదో విధంగా మీడియాకు లీకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే ఒక విషయం బయటికి వచ్చింది. బాలీవుడ్ తారలు అలియా భట్, పరిణీతి చోప్రాను రాజమౌళి సంప్రదించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఈ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించారా లేదా? అనే విషయం ఇంకా తెలీదు. కానీ, ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లలో ఒక్కరినే సినిమాలో తీసుకుంటారని ఆ భామ రామ్ చరణ్‌తో రొమాన్స్ చేయనుందని కానీ తారక్ సరసన మాత్రం హాలీవుడ్ భామ నటించబోతోందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా బ్రిటిష్ పాలన నేపథ్యంలో తెరకెక్కుతోన్న కారణంగా తారక్ సరసన హాలీవుద్ భామని ఫిక్స్ చేశారట. రామ్ చరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా కనిపించనుండగా తారక్ బందిపోటుగా నటిస్తున్నారు. ఈ బందిపోటు బ్రిటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడట. ఇప్పుడు ఆ పాత్ర కోసం ఓ హాలీవుడ్ భామను ఎంపిక చేసుకోవాలని జక్కన్న చూస్తున్నారట.మరి ఈ వార్తలో నిజమెంతో జక్కన్నే చెప్పాలి మరి ! 

More Related Stories