English   

పూరీ కొడుకు రొమాంటిక్ గా వస్తున్నాడు !

Akash-Puri
2019-02-11 14:27:08

తన టీనేజ్ లోనే 'ఆంధ్రాపోరి' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి చాల గ్యాప్ తీసుకొని ఇటీవలే తండ్రి దర్శకత్వంలో మెహబూబా సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు. మెహబూబాతో నటనకుగానూ మంచి పేరు తెచ్చుకున్న ఆకాష్ కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేక పోయాడు. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టం పరిక్షించుకోబోతున్నాడు. తండ్రి చెప్పిన బాటలోనే ఇప్పుడు ఆకాష్ ‘రొమాంటిక్’ అవతారం ఎత్తాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మూడో సినిమా ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్‌తో పాటు ఈ మూవీ షూటింగ్ ఈరోజు నుండే ప్రారంభం కాబోతుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు పూరీ. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పూరీ జగన్నాథ్ స్వయంగా అందిస్తుండగా గతంలో పూరీ దగ్గర అసిస్టంట్ గా పని చేసిన అనీల్ పాడూరి అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నారు. నేడు లాంఛనంగా ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి కళ్యాణ్ రామ్, పూరీ తన తల్లిలా భావించి ప్రతి నేలా డబ్బు పంపే సీనియర్ నటి రామాప్రభ హాజరవుతున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

More Related Stories