English   

మహానాయకుడులో స్పెషల్ అట్రాక్షన్ గా సీఎం మనవడు !

nara devansh act in ntr mahanayakudu
2019-02-11 11:32:50

ఇటీవలే షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడుకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో చంద్రబాబు, బాలకృష్ణల మనవడు దేవాన్ష్ నటించాడని అంటున్నారు. దేవాన్ష్ మీద సీన్ల చిత్రీకరణ పూర్తయిపోయిందని, కెమెరా ముందు దేవాన్ష్ భయపడలేదని సినిమా యూనిట్ చెబుతోందట. జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం మహానాయకుడు స్క్రిప్ట్ లో చాల మార్పులు చేశారు. కొన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ కొన్ని అనవసర సీన్లు తొలగిస్తూ మహానాయకుడుని రీమోడలింగ్ చేశారు. మొదటి భాగంలో బాలకృష్ణ చిన్నప్పటి పాత్రలో బాలయ్య రెండవ కూతురైన తేజస్వి మరియు భరత్ కుమారుడు ఆర్యవీర్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవాన్ష్ ని కూడా వాడేశారన్న మాట. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More Related Stories