English   

గోపీతో సునీల్...ఏమి రచ్చ చేస్తాడో ?

Gopichand
2019-02-11 11:45:24

రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. అయితే ఆ తరువాత ఆయన గోపీచంద్ కథానాయకుడిగా గౌతమ్ నంద అనే సినిమాను తెరకెక్కించాడు. గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా లైన్ బాగానే ఉన్నా టేకింగ్ పరంగానో మరేమిటో తెలీదు కానీ ఆ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. అప్పటి నుంచి ఆయన కొత్త ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలోనే వున్నాడు. ఆ తర్వాత ఆయన సొంత నిర్మాణంలో పేపర్ బాయ్ అనే సినిమాని వేరే దర్శకుడి పేరుతో నిర్మించినా అది కూడా పెద్దగా ఆడలేదు. మరోపక్క గోపీ పరిస్థితి కూడా అదే, అప్పుడెప్పుడో శ్రీ వాస్ తో చేసిన లౌక్యం సినిమా తర్వాత చెప్పుకోదగిన హిట్ కొట్టలేదు ఆ తరువాత చేసిన సినిమాలు ఆయనని పూర్తిగా నిరాశపరిచాయి. ఇప్పుడు తమిళ దర్శకుడు తిరుతో సినిమా చేస్తున్న గోపీని కలిసి సంపత్ నంది ఒక కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో గోపీచంద్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. పంతం ప్రొడ్యూసర్ రాధామోహన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు.అయితే ఈ సినిమాలో గోపీచంద్ తో మరో లీడ్ రోల్ కూడా ఉందట. సినిమా మొత్తం ఉండే ఆ కామెడీ పాత్ర, సునీల్ చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇక మార్చి నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అధికారికంగా ప్రారంభం కానుందని అంటున్నారు.

More Related Stories