English   

మాకు ఒక్క హిట్టు కావాలి అంటున్న స్టార్ డైరెక్టర్స్..

Tollywood
2019-02-11 19:38:24

ఒకప్పుడు వాళ్లతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎప్పుడూ ముందుండే వాళ్ళు. ఎప్పుడెప్పుడు వాళ్ళు డేట్స్ ఇస్తారా అంటూ వేచి చూసే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు.. వరుసగా ఫ్లాపులు వచ్చేసరికి వాళ్లు కనపడగానే మొహం చాటేస్తున్నారు మన హీరోలు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని సంచలన విజయాలతో ముందుకు తీసుకెళ్ళిన కొందరు స్టార్ డైరెక్టర్స్ స్టార్ లేకుండా ఓన్లీ డైరెక్టర్ గా మిగిలి పోయారు. ఒక్కరో ఇద్దరో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఒకప్పుడు రాజమౌళితో పాటు వరుస విజయాలు అందుకున్న కొందరు దర్శకులు ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వి.వి.వినాయక్ గురించి. ఒకప్పుడు సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్దలై పోయేది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వినాయక్.. ఇప్పుడు ఒక్క విజయం అంటూ వేచి చూస్తున్నాడు. ఇంటలిజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత ఇప్పటివరకు వరకు మరో సినిమా చేయలేదు వినాయక్. ఏడాది ఆయన ఖాళీగానే ఉన్నాడు. బాలయ్య సినిమా అనౌన్స్ చేసినా కూడా అది ఎప్పటికీ మొదలవుతుందో తెలియదు. ఇక పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా అలాగే ఉంది వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్క విజయం కూడా అందుకోవడం లేదు. ప్రస్తుతం రామ్ హీరోగా  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు పూరి జగన్నాథ్. శ్రీను వైట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన వైపు చూడాలంటేనే హీరోలు భయపడుతున్నారు. బోయపాటి శ్రీను కూడా ఈ లిస్ట్ లోకి జాయిన్ అయిపోయాడు. వినయ విధేయ రామ సినిమా తర్వాత ఓ రేంజ్లో ఆడుకున్నారు అభిమానులు. ఆ సినిమాను అంత చెత్తగా తీశాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు ఈయన. మరి మొత్తానికి దర్శకులు ఎప్పటికీ మళ్లీ హిట్ కొడతాడో చూడాలి.

More Related Stories