English   

విశాల్ లవర్ హిడెన్ టాలెంట్...నిద్ర పుచ్చేస్తుందట !

vishal shocked see anisha reddy s pet tiger
2019-02-11 21:39:21

తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్. ఆయన పెళ్లి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తుంటే  ఒక్కసారిగా తన ప్రేమ వ్యవహారం బయట పెట్టి త్వరలో తన ప్రేయసి అనీశారెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. అనీశాను ఓ సినిమా పని నిమిత్తం కలిశానని, కానీ ఆ పరిచయం పెళ్లికి దారితీస్తుందనుకోలేదని చెప్పుకొచ్చాడు. ఆమెకు తానే ముందు తనకు ప్రపోజ్‌ చేశానని వీధి శునకాలపై ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని ఆ సినిమకోసమే ఆమను కలిశానని విశాల్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా హాలీవుడ్‌ రేంజ్ లో తీస్తున్నామని సినిమాపై ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని అడిగానని చెప్పుకొచ్చాడు. అంతే కాక ఆమె జాతీయ స్థాయి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణని, సోషల్‌ వర్కర్‌ అని  ఓ పులికి శిక్షణ ఇచ్చి దానిని నిమిషాల్లో నిద్రపుచ్చగల టాలెంట్ ఆమె సొంతమని ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు విశాల్. అనీశాను దేవుడే నా కోసం పంపాడని విశాల్‌ చెప్పారు. మార్చి నెల మొదటి వారంలో విశాల్, అనీశాల నిశ్చితార్థం హైదరాబాద్‌లో వైభవంగా జరగనుంది. ఇక నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విశాల్‌ ఆ సంఘం కోసం కొత్త కార్యాలయాన్ని కట్టించేవరకు పెళ్లిచేసుకోనని గతంలో అన్నారు. ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడతానని, ఇందుకు అనీశా కూడా మద్దతుగా నిలిచిందని తెలిపారు. కార్యాలయ కట్టడం పూర్తయ్యేవరకు పెళ్లి కోసం ఎదురుచూస్తానందని పేర్కొన్నారు.

More Related Stories