English   

దుబాయ్ వెళ్ళిన ఎన్టీఆర్...ఎందుకంటే ?

NTR
2019-02-12 10:43:07

బాహుబలి సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత క్రేజీ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో లీడ్ రోల్స్ ఉన్న ఇద్దరూ స్టార్ హీరోలు కావడంతో ఈ సినిమా మీద భీబత్సమైన అంచనాలు ఉన్నాయి. మామూలుగా రాజమౌళి సినిమా లేట్ అవుతుందని ఒక చెడ్డ పేరు ఉన్నా ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్ళాడు. ఇంతటి భారీ చిత్రం చేస్తుండగా, ఆ హీరో సడన్‌గా విదేశాలకి వెళ్తే అది ఖచ్చితంగా సదరు సినిమాకి సంబంధించిన టూరే అని అనుకున్నారు అంతా. ఎన్టీఆర్‌ ఏదో గెటప్‌ కోసమో లేదా కొత్త లుక్‌ ప్లానింగ్‌ కోసమో ఎవరైనా స్టయిలిస్ట్‌ దగ్గరకి వెళ్లి వుంటాడని కొందరు తమదైన అట సమాచారాలతో రెడీ అయ్యారు. అయితే ఎన్టీఆర్‌ వెళ్లింది అచ్చంగా ఫ్యామిలీ ట్రిప్‌ కేనని షూట్ లో ఇన్ని రోజులూ ఉన్న ఆయన తన కుటుంబంతో సంతోషంగా కొద్దీ రోజులు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడనేది ఖచ్చితమైన సమాచారం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. దీంతో ఆయన దుబాయ్ బయల్దేరిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చాక ఆర్ఆర్ఆర్ షూట్ లో పాల్గొననున్నాడు . సినిమాను భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. 

More Related Stories