English   

సైరాలో బన్నీ...నిజమేనంట ?

allu-arjun
2019-02-12 13:44:38

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న తాజా సినిమా సైరా. రాయల సీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమాను కిక్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి ఇతర బాషల స్టార్ నటులు నటిస్తుండగా ఆ మధ్య అల్లు అర్జున్ పేరు కూడ వినిపించింది. ఆ తర్వాత అదేమీ లేదని సినిమాలో అల్లు అర్జున్ నటించడంలేదని, సినిమా కోసం ఓన్లీ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాని వార్తలు వచ్చాయి. అయితే వీటి మీద అద్జికరిక ప్రకటన ఏమీ రాకాపోగా ఇప్పుడు మళ్ళీ సినిమాలో బ‌న్నీ నటిస్తున్నాడని మళ్ళీ వార్త‌లు వస్తున్నాయి. గతంలో సురేంద‌ర్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రేసుగుర్రం వీరిద్ద‌రికి మంచి హిట్ ఇవ్వగా ఇప్పుడు సైరా సినిమా కోసం బన్నీ కీల‌క పాత్ర పోషించాడ‌ని అంటున్నారు. ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంద‌ని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బ‌న్నీ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో క‌లిసి సినిమా చేస్తున్నారు.  

More Related Stories