English   

మజిలీ ఫస్ట్ లుక్...స్పెషల్ ట్రీట్ !

Majili
2019-02-12 11:43:28

నాగార్జున నటవారసుడిగా మంచి జోష్ మీద వచ్చిన నాగ చైతన్యకి మొదటి హిట్ మాత్రం దొరికింది ఏం మాయ చేశావేతోనే. సెంటిమెంట్ గా తీసుకున్నాడో ఏమో ఆమెనే జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన చాలా ఏళ్ల తరువాత దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ అని మజిలీ చిత్రంతో ప్రేక్షకుల్ని మాయ చేసేందుకు రెడీ అయ్యారు. పెళ్లి తరువాత మొదటిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో మజిలీ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా టీజర్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో బస్‌ ఫుట్‌బోర్డ్‌లో సమంత నుల్చోని ఉండగా ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఆమె వెనకనే నుంచుని ఉన్నాడు నాగ చైతన్య. మజిలీ టైటిల్‌కి తగ్గట్టుగానే తాజా పోస్టర్ ప్రేమికుల్ని రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకువెళ్లేట్టే ఉంది పోస్టర్. మజిలీ టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్టు ఈ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.  అలా ఈ లవర్స్ డేకి లవర్స్‌కి మజిలీ టీజర్‌ తో తియ్యని ట్రీట్ ఇవ్వబోతున్నారన్న మాట. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుండగా నిన్నుకోరి వంటి వైవిధ్యమైన సినిమాను, పలు హిట్ షార్ట్ ఫిలిమ్స్ ని తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంతా రైల్వే క్లార్క్ గా నటిస్తుండగా, నాగచైతన్య క్రికెటర్ గా నటిస్తున్నాడు.

More Related Stories