English   

ఎన్టీఆర్ మహానాయకుడు ఏం చేయబోతుందో.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..

NTR-Mahanayakudu
2019-02-13 11:41:18

యాత్ర సినిమా ఊహించిన దానికంటే పెద్ద విజయం వైపుగా అడుగులు వేస్తుండటంతో నందమూరి అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పుడు తమ మహానాయకుడు సినిమా ఏం చేయబోతుందో అని టెన్షన్ పడుతున్నారు వాళ్ళు. ఫిబ్రవరి 22 న ఈ చిత్రం విడుదల కానుండటంతో బాలయ్య మహానాయకుడుతో ఎలాంటి మాయ చేయబోతున్నారా అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. ఇక బాలకృష్ణ కూడా మహానాయకుడు సినిమాతో కచ్చితంగా విజయం అందుకోవాలని ధీమాగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం విజయం సాధించడం ఆయనకు కూడా కీలకం. కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఆ సినిమా కొని నష్టపోయిన బయ్యర్ల కోసమైనా మహానాయకుడు విజయం సాధించాలని కోరుకుంటున్నాడు బాలకృష్ణ. దానికి తోడు ముఖ్యమైన రాజకీయాలు మొత్తం మహానాయకుడు సినిమాలోనే ఉండటంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇన్నాళ్లు విడుదల తేదీ కోసం చూస్తున్న మహానాయకుడు.. ఫిబ్రవరి 22న వస్తుందని తెలియడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఫిబ్రవరి 16న అనంతపురంలో మహానాయకుడు ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. దీనికి తెలుగు ఇండస్ట్రీ అతిరథమహారధులు వస్తారని తెలుస్తోంది. యాత్ర సినిమా ఇప్పటికే చాలా చోట్ల 90 శాతం వసూళ్లు వెనక్కి తీసుకు వచ్చేసింది.. మరోవైపు మహానాయకుడు బిజినెస్ కూడా దాదాపు 50 కోట్ల వరకు జరుగుతుంది. యాత్ర విజయం సాధించడంతో ఇప్పటికే ఎన్టీఆర్ పై వైఎస్ఆర్ విజయం అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దాంతో ఇప్పుడు ఆ కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు బాలకృష్ణ. మరి ఏం జరుగుతుందో చూడాలి.

More Related Stories