English   

బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు !

Kavitha-Gowda
2019-02-13 12:21:02

బుల్లితెరలో విశేష ఆధరణ దక్కించుకుంటున్న బిగ్ బాస్ అన్ని బాషలలో చాలా ఏళ్లుగా ఆధరణ దక్కించుకుంటూనే ఉంది. ముందు హిందీలో మొదలయిన ఈ సిరీస్ అన్ని బాషలలో మొదలైంది. తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే రెండు సీజన్ ల బిగ్ బాస్ పూర్తి అవగా కన్నడలో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గానే సాగుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ పై ఎన్నో వివాదాలు విమర్శలు వచ్చాయి. అయితే మొట్ట మొదటి సారిగా బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కంటెస్టెంట్ లైంగిక వేదింపుల కేసును నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ షో కార్యక్రమ పోటీల్లో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్ లైంగిక వేధింపులకు గురై ఆ విషయాన్నీ మహిళా పోలీస్ కమిషన కు పిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో లో కూడా ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అంటూ ఆశ్చర్య పోతున్నారు జనాలు. కన్నడ బిగ్ బాస్ పోటీల్లో పాల్గొని, కొంతవరకు ఆడి ఎలిమినేషన్ తో మధ్యలోనే బయటకు వచ్చేసింది కవితా గౌడ. ఈమె సహ కంటెస్టెంట్ అయినా యాండీపై మీద సంచలన ఆరోపణలు చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు యాండీ తనను లైంగికంగా వేధించాడని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ కార్యక్రమంలో జరిగిన వేధింపును గూర్చి షో నిర్మాత గురుదాస్ శణైకి ముందుగానే వివరించానని ఈ సంఘటన పై షో నుండి బయటకు వచ్చాకే నోరు తెరచి మాట్లాడతానని ఆయనకీ చెప్పిందట. మరోవైపు మరో వైపు యాండీ ఈ విషయమై స్పందిస్తూ బిగ్ బాస్ తర్వాత తాను కవితాను కలవలేదని ఆమె పోటీలో ఓడిపోవడంతో తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ యాండీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  
 

More Related Stories