English   

అక్కడయినా వినయంగా నిలబడతాడా ?

Vinaya-Vidheya-Rama
2019-02-13 06:03:18

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక  నిరాశ పరచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 63 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఫ్లాపుల్లో రికార్డ్ ను నమోదు చేసింది. తాజాగా ఈ సినిమా తమిళ్ లో మలయాళం లో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది.  ఈ శుక్రవారం కేరళలో రిలీజ్ అయ్యింది ఈచిత్రం అక్కడ శుక్రవారం 10.60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టగా శనివారం 8 .90 లక్షలు అలాగే ఆదివారం 9.10 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక మూడు రోజులకుగాను అక్కడ ఈ చిత్రం 28.60 లక్షల గ్రాస్ ను 11.50 లక్షల షేర్ ను రాబట్టింది. సినిమాను అక్కడ టోటల్ గా 75 లక్షల వరకు అమ్మినట్లు సమాచారం అందుతుంది. ఇక తమిళ్ లో మొదటి రోజు 14 లక్షల గ్రాస్ ని రెండో రోజు అక్కడ 10 లక్షల వరకు గ్రాస్ ని అందుకోగా రెండు రోజుల్లో సినిమా అక్కడ 24 లక్షల గ్రాస్ ని 10 లక్షల దాకా షేర్ ని అందుకుంది. సినిమాను అక్కడ టోటల్ గా 1.2 కోట్ల వరకు అమ్మినట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా రెండు ఏరియాల్లో సినిమా ఆల్ మోస్ట్ 2 కోట్ల బిజినెస్ కి 43.5 లక్షల గ్రాస్ ని 18 లక్షలకు పైగా షేర్ ని అందుకుందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.  

More Related Stories