English   

వెంకటేష్ విలన్ క‌ళాభ‌వ‌న్ మృతిపై సిబిఐ సీరియస్.. వాళ్లకు లై డిటెక్టర్..

Kalabhavan-Mani
2019-02-13 06:42:54

జెమినిలో విల‌న్ గా న‌టించిన క‌ళాభ‌వ‌న్ మ‌ణిని అంత త్వ‌ర‌గా తెలుగు ప్రేక్ష‌కులు మ‌రిచిపోలేరు. ఆ సినిమా ఫ్లాపై ఉండొచ్చు గానీ మ‌ణి మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు. జెమినితో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆయ‌న న‌టించారు. ఈ మ‌ధ్యే కేవ‌లం 45 ఏళ్ల‌ వ‌య‌సులోనే అర్ధాంత‌రంగా త‌నువు చాలించారు. చాలా కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న క‌ళాభ‌వ‌న్ మ‌ణి.. 2016, మార్చ్ 6న కొచ్చిలోని అమృత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

ఆయన మరణించి మూడేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ కళాభవన్ మణి మృతిపై అనుమానాలు అలాగే ఉన్నాయి. మ‌ణిది అస‌హ‌జ మ‌ర‌ణ‌మ‌ని తేల్చారు పోలీసులు. మ‌ణి శ‌రీరంలో మిధైల్ ఆల్కహాల్ ఎక్కువ‌గా ఉండటంతో కేసుని రిజిస్టర్ చేసారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం పెద్దమొత్తంలో ఆల్కాహాల్ సేవించడం వల్ల మణి అనారోగ్యం పాలైనట్లు తేల్చారు. దానికి తోడు ఆయన శరీరం లో పురుగుల మందు ఉంది అని తేల్చారు డాక్టర్లు. వాంతులు అవడం వల్ల కళాభవన్ మణి ఆస్పత్రి పాలయ్యారని చికిత్స చేస్తుండగా మరణించారని ఆస్పత్రి వర్గాలు తేల్చాయి.

అనుమానం రావ‌డంతో కొచ్చి లోని మ‌రో ఆస్ప‌త్రిలో మ‌ణి శ‌రీరానికి మ‌రోసారి పోస్ట్ మార్ట్ నిర్వ‌హించారు. మ‌ణి శ‌రీరంలో విషం కూడా ఉంద‌నే వార్త‌లు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. ఆయ‌న మ‌ర‌ణించిన 15 రోజుల త‌ర్వాత క‌ళాభ‌వ‌న్ మ‌ణి స్నేహితులు న‌లుగుర్ని అదుపు లోకి తీసుకుని ప్ర‌శ్నించారు పోలీసులు. అస‌లు మ‌ణి చ‌నిపోవ‌డానికి ముందు రోజు ఏం జ‌రిగింది..? ఎవ‌రెవ‌రు కూర్చుని మందు కొట్టారు..? మ‌ణి తాగాడా.. లేదా తాగించారా..? ఇవ‌న్నీ విచార‌ణ‌లో తేలాయి. ఇప్పుడు ఈ స్నేహితులను  లై డిటెక్టర్ టెస్ట్ కు  తీసుకెళ్లనున్నారు. దీనికి సిబిఐ నుంచి వాళ్లకు కావాల్సిన అనుమతి వచ్చింది. ఆ త‌ర్వాత పోలీసులు ఒక్క‌టి మాత్రం చాలా క్లియ‌ర్ గా చెప్పారు.. క‌ళాభ‌వ‌ణ్ మ‌ణి చ‌నిపోలేదు.. ఆయ‌న్ని చంపేసారు..! ఇక ఇప్పుడు ఆయ‌న మృతిపై సిబిఐ ఎంక్వైరీ కూడా వేసింది. చూడాలిక‌.. ఈయ‌న మ‌ర‌ణం ఇంకెన్ని మ‌లుపులు తిర‌గ‌నుందో..?

More Related Stories