English   

మోదీ బ‌యోపిక్‌లో అమిత్ షా ఫస్ట్ లుక్ !

Manoj-Joshi
2019-02-13 13:56:12

ప్ర‌స్తుతం అన్ని బాషలలో బ‌యోపిక్‌ల సీజ‌న్ న‌డుస్తుంది. బాలీవుడ్ లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో మేరీ కొమ్ తెరకెక్కించిన ఒమంగ్ కుమార్  పీఎం నరేంద్ర మోదీ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. అహ్మ‌దాబాద్‌లో ప్రారంభ‌మైన ఈ చిత్ర షూటింగ్, గుజ‌రాత్‌లోని ప‌లు ప్రాంతాల‌లోను చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. మోదీ త‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో ముఖ్య‌మంత్రిగా ఎలా ఎదిగి ఆ తర్వాత ప్ర‌ధాన మంత్రి ఎలా అయ్యాడో బ‌యోపిక్‌లో చూపించ‌నున్న‌ట్టు చెబుతున్నారు. ఇక తాజాగా భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్‌ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆయన పాత్రలో టీవీ న‌టుడు మనోజ్ ‌జోషి నటిస్తున్నారు. అమిత్‌ షా పాత్రలో ఆయన అచ్చు గుద్ది నట్లు ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. బుల్లితెర‌పైనే కాదు వెండితెర‌పై కూడా ప‌లు పాత్ర‌ల‌లో క‌నిపించారు మ‌నోజ్ జోషి. చివ‌రిగా వ‌రుణ్ ధావన్ జుడ్వా 2, స‌ల్మాన్ ఖాన్ ప్రేమ్ ర‌తన్ ధ‌న్ పాయో చిత్రాల‌లో ప్రేక్ష‌కుల‌ని అరల్రించిన ఆయన ఇప్పుడు మిత్ శా అవతారం ఎత్తారు. వివేక్‌ ఒబెరాయ్ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

More Related Stories