English   

ఏంటి మెగా మేనల్లుడి సినిమాలో విలన్ విజయ్ సేతుపతా..?

Vijay-Sethupathi
2019-02-13 08:13:33

అదేమి చిత్రమో కానీ మెగా కుటుంబం నుంచి ఎవరు హీరోగా వచ్చినా కూడా అదే క్రేజ్.. అదే ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా వస్తున్న సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికితోడు సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 20 శాతం పూర్తయింది. ఇదే ఏడాది సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతిని చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. వరుసగా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. తెలుగు ఇండస్ట్రీపై ఇప్పుడు దృష్టి పెట్టాడు. ఇప్పటికే చిరంజీవి సైరా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా విజయ్ సేతుపతిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. క్యారెక్టర్ నచ్చితే హీరో ఎవరో అని కూడా చూడడు. తన పాత్రకు మంచి పేరు వస్తుంది అంటే చిన్న సినిమాలలో కూడా నటిస్తాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు కూడా వైష్ణవ్ తేజ్ సినిమాలో క్యారెక్టర్ అద్భుతంగా ఉండటంతో విజయ్ ఒప్పుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

More Related Stories