English   

రామ్ ఇంకో సినిమా ఓకే చేశాడు ! 

Ram-Pothineni
2019-02-13 17:42:36

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తన చివరి చిత్రంలో పద్దతైన తెలుగబ్బాయిగా నటించిన రామ్. పూరీ సినిమా కోసం మాస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. పూరి సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాను షూట్ శరవేగంగా పూర్తి చేసి వేసవి సెలవుల సందర్భంగా ఈ మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా అయిన వెంటనే మరో సినిమా చేయడానికి రామ్ ప్లాన్ చేస్తున్నాడట, జూన్ నుంచి మరో ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లేలా ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడని టాక్. ఇటీవల రామ్ కి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర ఒక మంచి కథ చెప్పాడట. సినిమా లైన్ నచ్చడంతో ఆయనకి, రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని అంటున్నారు. రామ్ సొంత బేనర్ స్రవంతి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకేక్కనుందట. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
 

More Related Stories