English   

యాత్రకి కులం రంగు...సకాలంలో వివరణ !

Mahi-V-Raghava
2019-02-13 18:09:52

మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన యాత్ర సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్‌సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. కానీ, ఈ సినిమాపై సెలబ్రిటీలు స్పందించకపోవడం వైఎస్సార్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.  విడుదలయ్యే ప్రతి సినిమా మీద ప్రశంసలు కురిపించే సినీ పెద్దలు, సెలబ్రిటీలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్న యాత్ర సినిమా విషయంలో కులం కార్డు తెస్తున్నారు వైఎస్ అభిమానులు. మరి నిజంగా కులం కారణమో మరేమో కానీ ఈ సినిమా మీద పెద్దగా ఎవరూ సినీ పరిశ్రమ వారు స్పందించలేదు. అయితే దీని సీరియస్ గా తీసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో తిట్టి పోస్తున్నారు. అయితే ఇది ఇంకెంత దూరం వెళ్తుందో అని అనుకున్న యాత్ర దర్శకుడు మహి వి రాఘవ ఒక ప్రకటన చేసారు. 

వైఎస్ అభిమానులు అసహనానికి గురికావొద్దని, సెలబ్రిటీల మీద ఎలాంటి విమర్శలు చేయొద్దని కోరారు. తన సినిమాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని ‘మార్పు, మరుపు, మరణం సహజం, అనివార్యం’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యాత్ర సినిమాపై సెలబ్రిటీల స్పందన కావాలని కోరుకోవడం వైఎస్ అభిమానులు, ఆయనను ఆరాధించేవారిని ఎంతగానో బాధిస్తుందని తనకు సంబంధించిన వరకు అది వైఎస్ కథ మాత్రమేనని దీనికి ఎవరి ప్రశంసలు అక్కర్లేదని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఒకరి ప్రశంసల గురించి ఎదురుచూడటం నాకు అవమానం లాంటిదేదని ఒక కథకుడిగా నేను చేయాల్సింది చేశానని ఎంతో ఇష్టంతో కథ చెప్పానని దాన్ని మీరు చాలా ఆదరించారని ఇక దీనిపై ఇతరుల స్పందన అడిగితే భిక్షం అడిగినట్లు అవుతుందని రాఘవ పేర్కొన్నారు. 

అయితే ఈ వివాదం విషయానికి వస్తే ఈ సినిమాని వైఎస్ కుటుంబ సభ్యులకి తప్ప సినీ పరిశ్రమ వారికి షో వేశారో లేదో తెలియదు, నిజానికి సెలెబ్రిటీలు వారంతట వారు సినిమాకి వెళ్లి చూడరు, ఫలానా ప్రోడ్యూసర్ లేదా ఫలానా డైరెక్టర్ క్లోజ్ అయ్యి, టిక్కెట్లు పంపితేనో లేక, స్పెషల్ గ షో వేస్తేనో చూస్తారు, కానీ ఈ యూనిట్ ప్రత్యేక షో వేయలేదు, అదీ కాక ఇప్పుడు హౌస్ ఫూల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఒకరిద్దరు సెలెబ్రిటీలు తప్ప వేరే వారు సినిమా చూడరు, ఈ విశయాన్ని కూడా మహీ తన ప్రకటనలో పేర్కొని ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. మొత్తానికి కత్తి మహేష్ లాంటి వారు ఈ వివాదానికి కులం మారక అంటించాలని చూసినా  మహీ అండ్ టీం సకాలంలో ప్రకటన చేసింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న సాయంత్రమే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమా చూసి డైరెక్టర్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

More Related Stories