English   

ఆకాశాన్ని తాకుతున్న మహా నాయకుడు రేట్లు.. పాతాళంలో డిస్ట్రిబ్యూటర్లు..

NTR-Mahanayakudu
2019-02-13 19:26:23

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. ఆ సినిమా విడుదలకు ముందు 70 కోట్ల బిజినెస్ జరిగితే.. అన్నగారి సినిమా కథ ఈజీగా వచ్చేస్తాయని అందరూ నమ్మారు. అదే నమ్మకంతో సినిమాను కొన్నారు కూడా. అప్పటి వరకు బాలకృష్ణ కెరీర్లో 48 కోట్లు మాత్రమే అని తెలిసినా కూడా ధైర్యం చేసి కథానాయకుడు సినిమాను 72 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా కేవలం 23 కోట్లు మాత్రమే వసూలు చేసి దాదాపు 50 కోట్లు నష్టాలు తీసుకొచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది కథానాయకుడు. 

ఇంత దారుణమైన డిజాస్టర్ తర్వాత మహానాయకుడు సినిమాను ఫ్రీగా ఇచ్చిన తప్పు లేదంటున్నారు విశ్లేషకులు. బాలయ్య కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని ఇన్ని రోజులు వార్తలు వినిపించాయి. కథానాయకుడు సినిమా తీసుకొని నష్టపోయిన వాళ్లకి మహానాయకుడు సినిమాను ఉచితంగా ఇస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని.. ఇప్పుడు మహానాయకుడు సినిమా కూడా భారీ రేట్లకు అమ్మడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వాదన వినిపిస్తోంది. మహానాయకుడు సినిమా బిజినెస్ పనులు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూసుకుంటున్నాడు. 

ఈయన ఈ సినిమా రేట్లను భారీగా చెబుతున్నాడని.. కథానాయకుడు సినిమా తీసుకొని నష్టపోయిన కూడా ఏమాత్రం కనికరం చూపించకుండా మరోసారి భారీ రేట్లు అడుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. తొలి భాగం డిజాస్టర్ కావడంతో కేవలం 25 శాతం రాయితీ ఇచ్చి రెండో భాగం హక్కులను కొనలేని స్థాయిలో చెబుతున్నారని తెలుస్తోంది. ఓవర్సీస్ హక్కులు కూడా భారీ రేటుకు చెబుతుండటంతో ఏం చేయాలో డిస్ట్రిబ్యూటర్లకు అర్థం కావడం లేదు. మొత్తానికి కథానాయకుడు షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే విడుదలకు ముందే మహానాయకుడు చుక్కలు చూపిస్తుంది. ఫిబ్రవరి 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories