టాలీవుడ్ లో మరో విషాదం...నిర్మాత మృతి !

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మరణ వార్త మరవక ముందే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీ మంజునాథ లాంటి డివోషనల్ సినిమా తెరకెక్కించిన నిర్మాత నారా జయశ్రీ దేవి ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె వయసు అరవై సంవత్సరాలు. అయితే ఆమె కుటుంబం అంతా బెంగుళూరులో స్థిరపడటంతో ఆమె భౌతుక కాయాన్ని బెంగుళూరుకు తరలించారు. శ్రీ మంజునాథ, చంద్రవాసం, సైలెంట్, వందేమాతరం, జగద్గురు ఆదిశంకర వంటి తెలుగు చిత్రాలను ఆమె నిర్మించినా శ్రీ మంజునాధ ఆమెకు పేరు తెచ్చి పెట్టింది. తెలుగుతో పాటు ఆమె కన్నడలో కూడా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలనాటి కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్, హీరో కుమార్ గోవింద్ కలిసి నటించిన ‘కోన ఇదైతే’ చిత్రంతో దర్శక, నిర్మాతగా కన్నడ కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జయశ్రీ ఆ తరువాత ‘భవానీ’ అనే చిత్రానికి ఆమె దర్శకత్వం కూడా వహించారు. అనంతరం పూర్తి స్థాయి నిర్మాతగా మారి తెలుగు, కన్నడ భాషల్లో 20కి పైగా చిత్రాలను నిర్మించారు.