English   

పూరీ జగన్నాథ్.. వీడు మామూలోడు కాడు..

Puri-Jagannadh
2019-02-13 19:45:54

ఇప్పుడు ఈ టైటిల్ దర్శకుడు పూరి జగన్నాథ్ కు బాగా సరిపోతుంది. ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ వస్తేనే ఎవరు ఎవరిని పట్టించుకోరు. అలాంటిది పూరి జగన్నాథ్ కు కొన్ని సంవత్సరాల నుంచి వరుస ఫ్లాపులు ఉన్నాయి. అయినా కూడా ఈయన బ్రాండ్ అలాగే ఉంది. ఇప్పటికీ పూరి జగన్నాథ్ అడిగితే డేట్స్ ఇచ్చే హీరోలు.. నిర్మించే నిర్మాతలు ఉన్నారు. కానీ ఈయన మాత్రం అలా చేయడం లేదు. తనకు ఫ్లాప్ లు ఉన్నాయని తెలిసి తన సినిమాలు తన నిర్మించుకుంటున్నాడు.. కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు. ఈయన తెగింపు చూసి నిజంగానే బాబోయ్ వీడు మామూలోడు కాడు అనుకుంటున్నారు కొందరు దర్శక నిర్మాతలు. ఇండస్ట్రీ నుంచి పూరి జగన్నాథ్ కు కావాల్సిన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. కానీ ఈ మధ్య కాలంలో అది తగ్గిపోయింది. 

ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. దాంతో తన వల్ల ఎవరికి నష్టం కలగకూడదని తన సినిమాలని తనే నిర్మించుకుంటున్నాడు పూరి జగన్నాథ్. తాజాగా కొడుకు ఆకాష్ పూరితో రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాకు ఆయన దర్శకుడు కాదనే ఒక మాటే కానీ మొత్తం తానే చూసుకుంటున్నాడు. ఇప్పటికే కథ స్క్రీన్ ప్లే మాటలు అన్నీ ఇచ్చాడు పూరి. ఆయన శిష్యుడు అనిల్ పడూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదే ఏడాది రొమాంటిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటు రామ్ హీరోగా వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాను కూడా తన ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నాడు పూరీ జగన్నాథ్. మొత్తానికి ఇన్ని ప్లాప్స్ తర్వాత కూడా నిలబడి తన సినిమాలకు తనే పెట్టుబడి పెట్టుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఈ గట్స్ చూసి అందరు ఫిదా అయిపోతున్నారు ఇప్పుడు.

More Related Stories