English   

మహేష్ బాబు తర్వాత సినిమా కోసం క్యూలో ఉన్న దర్శకులు..

directors are waiting for  movie with mahesh babu
2019-02-13 13:36:16

మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షితో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. మరో నెల రోజుల్లో దీనికి పూర్తిగా గుమ్మడికాయ కొట్టేసి కొత్త సినిమాతో బిజీ కానున్నాడు సూపర్ స్టార్. ముందు నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం మహర్షి తర్వాత మహేష్ బాబు.. సుకుమార్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అఫిషియల్ పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఇంకా కథ సిద్ధం చేయలేదని దానికి మరో ఆరు నెలలైనా కచ్చితంగా పడుతుందని తెలుస్తోంది. మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబుకు అంత గ్యాప్ తీసుకోవడం ఇష్టం లేదు. అందుకోసమే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్.

దీనికోసం వరుసగా కుర్ర దర్శకులను నమ్ముకున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే అనిల్ రావిపూడి సూపర్ స్టార్ ఇమేజ్ కు సరిపోయే కథ ఒకటి సిద్ధం చేశాడని.. ఆయనకు చెప్పాడని తెలుస్తోంది. దీనిపై మహేష్ నిర్ణయం ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. దానికి తోడు సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా ఉంది. అయితే ఈయన ప్రస్తుతం హిందీ అర్జున్ రెడ్డి రీమేక్ తో బిజీగా ఉన్నాడు కాబట్టి సందీప్ సినిమా ఊహించడం కష్టమే.

దానికి తోడు పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా మహేష్ బాబుకు ఒక కథ చెప్పాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. మహేష్ ఇమేజ్ ను ఖచ్చితంగా తరుణ్ భాస్కర్ బ్యాలెన్స్ చేయలేడని వారు భయపడుతున్నారు. మొత్తానికి మహర్షి తర్వాత మహేష్ బాబు ఏం చేస్తాడనేది ఇప్పుడొక సస్పెన్స్ డ్రామాగా మారిపోయింది.

 

More Related Stories