English   

బాలయ్య-బోయపాటి సినిమా ఉంటుందా.. ఉంటే బడ్జెట్ లిమిట్ ఎంత..

balakrishna boyapati srinu upcoming film
2019-02-13 13:58:20

అదేంటి బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తానని బాలకృష్ణ అందరిముందు ఒప్పుకున్నాడు కదా.. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో ఏకంగా స్క్రీన్ పై విజువల్ వేసి చూపించారు. ఇప్పుడు ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అనుకుంటున్నారా.. ఇదంతా వినయ విధేయ రామ సినిమా విడుదలకు ముందు జరిగిన కథ. దానికితోడు అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పై కూడా భారీ అంచనాలున్నాయి. కానీ కథానాయకుడు, వినయ విధేయ రామ రెండు డిజాస్టర్ కావడంతో ఇప్పుడు బాలయ్య-బోయపాటి సినిమాపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

ఇదివరకు ఈ సినిమాకు 60 కోట్లు పైన పెట్టాలని బోయపాటి భావించాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అంత పెట్టడం సాధ్యం కాదనిపిస్తుంది. ఈ బడ్జెట్ పై బాలయ్య కూడా అసంతృప్తిగానే ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కథానాయకుడు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించి చేతులు కాల్చుకున్నాడు బాలయ్య. వెంటనే తన ప్రొడక్షన్ లో మరో భారీ బడ్జెట్ సినిమా నిర్మించలేనని బాలయ్య తెగేసి చెబుతున్నారని తెలుస్తోంది.

దాంతో బోయపాటి సినిమా ఇప్పుడు ఉంటుందా ఉండదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా నిర్మించడానికి బోయపాటి అక్షరాల అరవై కోట్లు బాలకృష్ణను అడిగాడని.. కానీ ఆయన మాత్రం 40 కోట్లలో సినిమాని ఫినిష్ చేయాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి దీనిపై చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరిలోనే మొదలు పెట్టాల్సిన బోయపాటి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయం తేలకుండా.. బడ్జెట్ లిమిట్ ఎంత తెలియకుండా షూటింగ్ మొదలు పెట్టకూడదని బాలయ్య మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. అందుకే కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

More Related Stories