English   

జయరాం కేసులో సినీ నటుడి విచారణ !

surya-prasad
2019-02-14 08:59:53

ఈ నెల మొదటిలో సంచలనం రేపిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆయన శవం దొరికింది నందిగామలో కాబట్టి మొదట ఈ కేసును ఆంధ్ర పోలీసులు విచారణ చేశారు. దీనిలో రాకేశ్ రెడ్డి నిందితుడు అని పేర్కొంటూ, శిఖా చౌదరికి సంబంధం లేదని చెబుతూ వారు దర్యాప్తు ముగించారు. అయితే ఆయన భార్యకు వచ్చిన అనుమానాల మేరకు ఆ కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయ్యింది. తన భర్త హత్య కేసులో శిఖా చౌదరి ప్రమేయం ఉందని జయరాం భార్య చేసిన ఆరోపణల కోణంలో ఇప్పుడు తెలంగాణా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అందులో భాగంగా జయరామ్ హత్య కేసులో సినీ నటుడు సూర్య ప్రసాద్‌ ను విచారించారు. ఇతను ‘ఆ నలుగురు’ సినిమాలో రాజేంద్రప్రసాద్ కుమారుడిగా నటించిన విషయం తెలిసిందే. ఈ సూర్య ప్రసాద్‌ (పింగ్ పాంగ్ సూర్య)తో రాకేష్ మాట్లాడినట్లు కాల్ లిస్ట్ ఉండడంతో బంజారాహిల్స్ పోలీసులు ఈరోజు అతన్ని విచారించారు. గత నెల 30న రాకేష్ ఇంటికి సూర్య వెళ్ళాడని అంటున్నారు. అంతే కాకుండా రేపు కూడా ఈ కేసుతో సంబంధమున్న ఇంకోంత మందిని విచారించనున్నామని తెలిపారు. నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా స్నేహితులు ఉన్నారని, గతంలో పలు సెటిల్ మెంట్లు కూడా చేసినట్లు విచారణలో బయటపడింది. 

More Related Stories