English   

మజిలీ టీజర్...టాక్ దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ 

Majili-Teaser
2019-02-14 03:47:23

ఏ మాయ చేసావే చిత్రంలో లవర్స్‌ గా తెర మీద అలరించి రియల్ లైఫ్ కపుల్‌గా మారిన సమంత, నాగ చైతన్యలు శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాని  షైన్ స్క్రీన్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండవ హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్న ఈ సినియా టీజర్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొద్ది సేపటి క్రితమే విడుద‌లైంది. ఈ టీజర్ ఆరంభంలోనే ఇందులో నీకో సంవ‌త్స‌రం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం అని రావు ర‌మేష్ చెప్పే డైలాగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. టీజర్ ను ఆసాన్త్జం పరిశీలిస్తే అర్ధమయ్యే విషయం ఏమిటంటే పెళ్ళికి ముందు దివ్యాంశతో ప్రేమలో పడిన చైతూ ఆమె దూరం కావడంతో పిచ్చోడు అయ్యి, తాగుబోతుగా జులాయిగా మారతాడు, పెళ్లి చేస్తే మారతాడు అని భావించి సమంతతో పెళ్లి చ్జేస్తే ఆమెను ఎలా ఇబ్బంది పెట్టాడు, చివరకి ఎలా అర్ధం చేసుకున్నాడు అనేది కధాంశంగా తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాపెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ. వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా ఎమోషనల్ హా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయ‌నున్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

More Related Stories