English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ టాక్ : వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు !

Lakshmis-Ntr
2019-02-14 04:25:58

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్ కొద్దిసేపటిక్రితం విడుదలైంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను జోరుగా చేస్తున్న వర్మ ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసాడు. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఐకాన్స్ అని చెబుతూ ఆ ట్రైలర్ ఈ రోజు విడుదల చేసాడు వర్మ. రామ రామ రామ రామ అనే బ్యాక్ గ్రౌండ్ లో విన్పిస్తున్న బీజీఎంతో మొదలైన ట్రయిలర్ లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పాత్రలను, అలాగే నటుడు మోహన్ బాబు పాత్రను చూపించారు. 1989లో ఎన్టీఆర్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తర్వాత నుంచి ఈ స్టోరీని ఉండనున్నట్టు ట్రైలర్ ని బట్టి అర్ధం అవుతోంది. స్వామీ మీతో ఫోన్ లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే' అని ఆయన దగ్గరకు లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత 'రాత్రుళ్లు కూడా అక్కడే ఉంటోందట' అని జనం అనుకుంటున్నట్టు చూపించారు. ఇక చంద్రబాబు పాత్రధారితో ఈవిడ పేరు లక్ష్మీపార్వతి మా జీవిత చరిత్ర రాస్తున్నారని చెబుతున్నట్టు చూపారు. ఈ ట్రైలర్‌లో లక్ష్మీ పార్వతిని రామారావు పెళ్లి చేసుకోడానికి ముందు జరిగిన గొడవలు, చేసుకున్న తర్వాత బాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలా ఎన్టీఆర్‌ ను ఇబ్బంది పెట్టారు ? దానికి ఆయన ఎలా కుమిలి పోయారు ? అనేది వర్మ చూపించాడు. అయితే ఈ సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ తన మ్యాజిక్ చూపిస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు ఆయన ఒక్కడే కాదు అగస్త్య మజ్ను అనే ఆయన కూడా ఈ సినిమా దర్శకుడిగా ఉన్నారు.

More Related Stories