సూర్య ఎన్జీకే టీజర్...వేచి చూద్దాం !

ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో సూర్య తన 36వ చిత్రంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్, సాయిపల్లవి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ, తెలుగు టీజర్లను రిలీజ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా మీద అభిమానులలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూర్య పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. సూర్య చెవిటివాడి పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. అతను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే ఎదురయిన సమస్యలు ఏమిటి అనే విషయాల మీద టీజర్ కట్ చేసారు. ‘నీలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే దేశం ఎంత బాగుపడుతుందో ఆలోచించి చూశాను’ అంటూ కొందరు భుజం తట్టడం చూపించారు. ఈ సినిమాకి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తన కెరియర్లో క్రేజీ సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకంతో సూర్య వున్నాడు. ఆయన అభిమానులు కూడా అదే ఆశతో వున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.