English   

మహానాయకుడు రిలీజ్ అవుతుందా ?

Buyers are worried about balakrishna's ntr mahanayakudu
2019-02-20 12:40:40

మరో రెండు రోజుల్లో మహానాయకుడు థియేటర్స్ ల్లోకి రాబోతున్న తరుణంలో వచ్చిన ఒక వార్త సంచలనాలు రేపుతోంది. ఈ సినిమా బయ్యర్లు షాక్ ఇవ్వబోతున్నారని, వారు మహానాయకుడు సినిమాని అడ్డుకుంటారని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఒక కొత్త ప్రచారం మొదలయ్యింది. ఇంతకీ వాయిదా వాదన ఎందుకు ఎందుకు అంటే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు పేరిట సంక్రాంతి బరిలో వచ్చి టాక్ బాగానే వచ్చినా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలే మిగిల్చింది. దీంతో కథానాయకుడు తాలూకు నష్టాలు 33 శాతం భరించి మహానాయకుడులో 40 శాతం వాటా తీసుకునేలా ఆ సినిమా బయ్యర్లను ఎన్బీకే ఫిలిమ్స్ సంస్థ ఒప్పించింది. దీంతో బయ్యర్లు తమ ఖర్చుల మీద సినిమా విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ఇప్పుడు ఎన్బీకే సంస్థ మొదటి భాగానికి సంబంధించిన ఎలాంటి నష్టపరిహారం తిరిగి చెల్లించే ఆలోచన లేదని, మహానాయకుడు బ్లాక్ బస్టర్ అవుతుందని అప్పుడు వచ్చిన లాభాల్లో లెక్కలు చూసుకుందామని వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో బయ్యర్లు సినిమా విడుదల చేసేందుకు అటు ఇటు గా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య తో ఓసారి మాట్లాడి ఈ సంగతి తేల్చుకోవాలని వారు భావిస్తున్నారట. చూద్దాం ఏమవుతుందో ?

More Related Stories